Wednesday, June 20, 2007

51.

ఇది నా 51 వ టపా....ఇంతకాలము నా సుత్తిని భరించిన వారికి, అభిప్రాయములు వ్రాసిన వారికి, వ్రాయని వారికి ధన్యవాదములు...

జ్యోతిగారికి..(ఈమధ్య, ఈమె చాలా మంచి పనులు చేసి, గోప్ప పేరుతెచ్చుకొంటోంది.. అందరూ ఈమెనే పొగుడుతున్నారు...ఏం..మేమేమి చేయటం లేదా..అంతా విడ్డురం కాకపోతె...ఏమిటో..)నేను సర్వదా ఋణపడి ఉన్నాను...తన ప్రోద్బలము, సహాయములే లేకపోతె..50 జోకులు వ్రాసేవాడిని కాదేమో...

జ్యోతీ గారు...ధన్యవాదములండీ....పైన వ్రాసింది (అదే బ్రాకెట్టులో వ్రాసింది) సరదాకే...

మరొక్కసారి అందరికీ ధన్యవాదములు..కృతజ్ఞ్తలు..


*****************************************************
వెంగళప్ప ఒక రేడియో షాపు వాడితో గొడవ పడుతున్నాడు.

వెంగళప్ప: నువ్వు నన్ను మోసం చేశావు...

షాపువాడు: లేదు సార్..! మీకు మంచి రేడియోనే ఇచ్చాను..

వెంగళప్ప: దీనిమీద "Made in Japan" అని రాసుంది...కానీ ఆన్ చేస్తే "All India Radio" అని అంటుంది...నేనేమన్నా తిక్కవాడిననుకొన్నావా?
*****************************************************

50.

వెంకట్రావు, తన అందమైన భార్యతో కారు వెనుక సీటులో కూర్చున్నాడు...డ్రైవరు, తన ముందున్న రియర్ వ్యూ అద్దాన్ని..కొంచెం సర్దుకొనేటప్ప్టికి..వెంకట్రావు కి కోపం వచ్చి...అంటాడు.

"నా భార్యనే అద్దంలో చూస్తావా...నువ్వు నడపక్కరలేదు...నేనే నడుపుకొంటాను...నువ్వు వెనక్కి వచ్చి కూర్చో"...

**********************************************************
ఇంటర్వ్యూలో..

అధికారి: మోటారు ఎలా స్టార్ట్ అవుతుంది?వెంగళప్ప: డుర్ర్..డుర్ర్..డుర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్..డుగుడుగుడుగు..

అధికారి: ఆపు..(కోపంగా)

వెంగళప్ప:డుగుడుగుడుగు...డుగు..డుగు..డు..గు..డు..గు

49. 500 సంవత్సరాల పురాతనమైనది

మ్యూజియం అధికారి: సుబ్బారావ్.. నువ్వు పగలగొట్టినది..500 సంవత్సరాల పురాతనమైనది..

సుబ్బారావు: హమ్మయ్యా...నేనింకా కొత్తదేమో అని భయపడ్డాను..తెలుసా..

48. లేడీ డాక్టర్ - వెంగళప్ప

లేడీ డాక్టర్: ఏమయ్యా, నీకు బుద్ధి లేదా..ఎందుకు రోజూ పొద్దునే క్లీనిక్ ముందు నిలబడి ఆడవారిని అలా చూస్తూఉంటావు?

వెంగళప్ప: మీరే కదా డాక్టర్, బయట బోర్డు పెట్టింది.."ఆడవారిని చూసే సమయం ఉద 9 గంటల నుండి 10గంటల వరకు" అని

Wednesday, June 13, 2007

తాజ్‌మహల్ - ప్రేమ

అమ్మాయి: నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు?

అబ్బాయి: షాజహాన్, ముంతాజ్‌ను ప్రేమించినంత!

అమ్మాయి: మరి నాకు తాజ్‌మహల్ ఎప్పుడు కట్టిస్తున్నావు?

అబ్బాయి: ఆల్రెడీ స్థలం కొన్నాను...నువ్వు ఎప్పుడు చస్తావా అని ఎదురు చూస్తున్నాను.

దేవలోకం లో IVRS(Interactive Voice Responsive System)

దేవలోకంలో IVRS పెడితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి.
***********************************************************

మీరు ఎప్పుడైనా భగవంతుణ్ణి ప్రార్దించారనుకోండి...అప్పుడు....

నమస్కారము..దేవలోకమును తలచుకున్నందుకు..ధన్యవాదములు

మీరు

వినాయకుడు గారి తో మాట్లాడలనుకొంటే...1 నొక్కండి.

శివుడు గారిని తో మాట్లాడలనుకొంటే...2 నొక్కండి.

కృష్ణుడు గారిని తో మాట్లాడలనుకొంటే...3 నొక్కండి.
(పొరపాటున 3 నొక్కిటే...వచ్చే జవాబు - క్షమించండి...ప్రస్తుతము వారు గోపికలతో బిజీగా ఉన్నారు...తరువాత సంప్రదించండి)

మిగతా దేవుళ్ళు / దేవతల లిస్టు కొరకు - 4 డైలు చేయండి.

రంభ, ఊర్వశి, మేనకల కోసము - 5 నొక్కండి (దీనిని నొక్కితే - లైను ఎంగేజ్)

(గనేష్ గారితో మాట్లాడుదామని 1 నొక్కారో...జవాబు...)

కోరిక కోరాలనుకుంటే - 5 నొక్కండి.

సమస్యలు / సలహాల కొరకు - 6 నొక్కండి.

ధన్యవాదములు తెలుపడానికి - 7 నొక్కండి.

ఇతరత్రా కొరకు మా కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ నారదులతో మాట్లాడాలంటే - 8 నొక్కండి.

(8 నొక్కారనుకొందాము)

శ్రావ్యముగా ఒక చిన్న భజన వినిపిస్తుంది...వెంటనే...

మా రికార్డుల ప్రకారము మీరు ఇప్పటికే ఈరోజు ఒక సారి మమల్ని తలచుకొన్నారు..రేపు మరళా ప్రయతించండి..

మీ అత్యవసరమైతే దగ్గరలో ఉన్న మా బ్రాంచి దేవాలయములోని మా ఎగ్జిక్యూటివ్ అయిన పూజారి గారిని కలుసుకోండి...

దేవలోకమును సంప్రదించినందుకు...ధన్యవాదములు...

****కనెక్షన్ కట్****