Tuesday, March 13, 2007

32. అందమైన అబద్ధం

పార్టీ అయిపోయిన తరవాత ఓ భార్య తన భర్తతో ఎంతో సంతోషంగా "ఏవండి

ఇవాళ నేను చేసిన వంటను మీరు అందరి ఎదుట మెచ్చుకోవడం చూసిన

నాకు సంతోషం, ఆశ్చర్యం రెండూ కలిగాయి తెలుసా?" అంది.


"ఇందులో ఆశ్చర్యపడాల్సిందేముంది. రోజూ నీ ఎదుట అబద్ధం చెప్పేవాడిని

ఈ రోజు అందరి ఎదుట చెప్పానంతే." అన్నాడు నిర్లక్ష్యంగా.

31.దొంగ

ఓ ధైర్యవంతురాలైన స్త్రీ ఇంట్లోకి ఓ అర్ధరాత్రి దొంగ వచ్చాడు. ఆ చీకట్లోనే వాడిని
చావగొట్టి స్పృహ తప్పేలా చేసింది. ఉదయం విచారణకు వచ్చిన పోలీసు ఇన్‍స్పెక్టర్
ఆమె సాహసాన్ని ప్రశంసిస్తుంటే దానికి ఆమె సిగ్గుపడిపోతూ........
’అబ్బే, ఇందులో నేను చేసిందేమీ లేదండి. అర్ధరాత్రి చప్పుడవడంతో మావారే క్లబ్బు
నుంచి వచ్చారనుకుని చావగొట్టానంతే’ అని చెప్పింది తాపీగా......

Thursday, March 08, 2007

30.టాప్ సీక్రెట్

ఓ శుభకార్యానికి హాజరైన అతిథులు పిచ్చాపాటిగా మాట్లాడుకుంటున్నారు.

"ఎంతైనా ఆడవాళ్ళ నోట మాట దాగదు." అన్నాడు గోపాల్.

"ఎందుకు దాగదు?" గయ్యిన లేచింది ఒకావిడ.

"అబ్బే కష్టమండి"

"నాకు 21 ఏళ్ళు ఉన్నప్పట్నుంచి నా వయసు ఎంతో దాచి పెట్టాను తెలుసా!"
గర్వంగా చెప్పిందావిడ.

"అయినా ఎప్పుడోసారి బయటికి వచ్చి తీరుతుంది" తేలిగ్గా తీసేశాడు గోపాల్.

"17 ఏళ్ళుగా దాచిపెట్టినదాన్ని ఇక ముందు దాయలేనా?"

29.నా చేతుల్లో ఏముంది.

ఇద్దరు స్నేహితులు బాగా మందుకొట్టి కార్లో తిరిగి వెళ్తున్నారు.ఒకతనికి బాగా
ఎక్కువైంది. రెండో అతను ఓ మాదిరిగా ఉన్నాడు. కారు దూసుకుపోతోంది.
ఇంతలో శశాంక్ అరవడం మొదలు పెట్టాడు.’చూడు స్తంభం...ముందు చూసుకో
స్తంభం...జాగ్రత్త రేయ్...బండి తిప్పు... తిప్పరా! ఒకటే అరిచాడు. అయినా కారు
స్తంభానికి గుద్దుకుంది. శశాంక్ ఆసుపత్రి పాలయ్యాడు.తెల్లారి స్నేహితుడు పళ్ళు
తీసుకుని శశాంక్‍ను పలకరించడానికి వచ్చాడు.

’నేను చెబుతూనే ఉన్నానా... కారు తిప్పమని’ కోప్పడ్డాడు శశాంక్.
’నేనెలా తిప్పనురా...నువ్వు డ్రైవ్ చేస్తుంటే’ విసుగ్గా అన్నాడు మిత్రుడు.