Monday, September 22, 2008

64. మేడ్ ఇన్ ఇండియా!

వెంకోజీ హైదరాబాదు లో ఒక ఆటో డ్రైవరు.
ఓకరోజు 'అరిటో సాటో' అనే జపాను దేశస్థుడు, (అ)భాగ్యనగరమును చూచుటకు, మన వెంకోజీ ఆటో యెక్కెను.
అతి వేగముగా వెళుతున్న హోండా కారుని చూసి
అరిటో సాటో : హై, それを見てください。, Honda Car , జపనీసె造、高速車 (చూడండి, జనీస్ మేక్, సూపర్ ఫాస్ట్).
కొద్ది సేపటి తరువాత అటుగా వెళుతున్న "టయోటా" కారుని చూసి
అరిటో సాటో : それを見てください。 , Tayota Car、జపనీసె造、および信頼できる車 (చూడండి, జనీస్ మేక్, నమ్మక మైనది).
వెంకోజీకి చిర్రెత్తుకొచ్చింది..
మరి కొంత దూరం వేళ్ళగానే, Mitsubishi- Lancer కనిపించింది..
అరిటో సాటో : హై, それを見てください。, Mitsubishi Car , జపనీసె造、高速車 (చూడండి, జనీస్ మేక్, సూపర్ ఫాస్ట్).
మన వెంకోజీ కి ఎక్కడో కాలింది...
ఆటో, గోల్కొండ ఖిల్లా దగ్గరకు చేరుకుంది..
మీటరు 1000 రూ.
అరిటో సాటో : టూ ఎక్స్పెన్సివ్ !!!
వెంకోజో : 'Meter' Made in India, very very fast

Sunday, September 21, 2008

63. వెంకోజీ - ఫ్రీ

షాపు వాడు : దీనికి ఏదీ 'Free' లేదు సార్!
వెంకోజీ : ఏమయ్యా! నన్నే మోసం చేద్దామని చూస్తావా!, మీ ఓనర్ కి చెబుతాను...ఏమనుకున్నావో..మర్యాదగా ఇవ్వు..దీనిమీద కూడా రాసుంది...చూడు.."CHOLESTROL FREE"(కొలెస్ట్రాల్ ఫ్రీ) అని...అమ్మా!..

Sunday, September 14, 2008

62. వెంకోజీ - ప్రాస

క్వీన్ ఎలిజిబెత్ ఒక పెద్ద పార్టి ఇస్తున్నది. దానికి వెంకోజీ కూడా అహ్వానించబడ్డాడు.
భోజినాల వేళలో, ఒక ఇంగ్లీసు దొర , "Paas the Wine You Devine" (పాస్ ది వైన్ యు డివైన్)అని పక్కన ఉన్న దొరసాని వద్ద నుండి వైను సీసా తీసుకున్నాడు.
ఆహా! దొరల ప్రాసే ప్రాస, నేను కూడా ఇదే ప్రాసలో మాట్లాడి, నా తడాఖా చూపిస్తాను, అని వెంకోజీ అనుకొని, పక్కనున్న దొర తో ఇలా అన్నాడు...
"Pass the Custard You Bastard!!!!".

"పాస్ ది కస్టడ్ యు బాస్టడ్!!!".

61. వెంకొజీ - అప్పు

వెంకొజీ బ్యాంకు లో అప్పు తీసుకొని ఒక కారు కొన్నాడు.
నెల నెలా డబ్బులు సరీగా కట్టకపోవడంతో, రికవరీ ఏజంట్ వచ్చి కారు తీసుకుపోయాడు....
వెంకోజీ (తనలో తాను) : అరె! డబ్బులు కట్టక పోతె, ఇలా వెనక్కి తీసుకొనిపోతారు అని తెలిస్తే, పెళ్లి కి కూడా బ్యాంకు లో అప్పు చేసేవాడిని కదా...

Wednesday, September 10, 2008

60. భక్తుడు - దేవుడు

భక్తుడు: దేవుడా..! నాకు కష్టాలివ్వు, బాధలివ్వు, దుఖాఃలివ్వు, నష్టాలివ్వు, టెన్షన్లివ్వు..నావెనుక భూతాలని, దయ్యాలని...వదులు...నన్ను నాశనం చెయ్యి..

దేవుడు : ఇంత వాగుడు దేనికి...సింపుల్ గా "భార్య"ని ఇవ్వు అనొచ్చుగా..!

Tuesday, September 09, 2008

59. పెళ్ళి - జైలు

శ్రీలత అర్ధరాత్రి మెలుకువచ్చి చూస్తే, భర్త రవి పక్కనలేడు, ఆందోళనగా అన్నీ గదులూ చూసి, చివరకు వంటగదిలో కి వెళితే, ఆక్కడ దిగులుగా, శున్యంలోకి చూస్తూ కంట్లో కన్నీరుతో కనిపించాడు.
శ్రీ భయపడి, రవిని పలకరించింది..

శ్రీ : ఏమండి? ఏమైంది?
రవి : శ్రీ, 7 యేళ్ళ క్రితం, మనిద్దరం పార్కులో ప్రేమించుకొంటుంటే, మీ అన్న చూసి, మీనాన్నకు చెప్పాడు..
శ్రీ : అవునండీ, నాకు జ్ఞాపకం ఉంది.
రవి : అది తెలిసిన మీనాన్న, కత్తి పట్టుకొచ్చి, మా అమ్మాయిని చేసుకుంటావా, లేక పోలిసులతో చెప్పి జైలుకు పంపించనా అని అడిగాడు.
శ్రీ : అవునండీ..అయితే?
రవి : జైలు అనేసరికి భయముతో నిన్ను చేసుకున్నాను, అదే జైలు కెళ్ళుంటె, ఈరోజుతో నాకు విడుదల అయ్యేది కదా.....అని భోరున ఏడ్చాడు.
శ్రీ : ఆ!.

58. తేడా!

stress (స్ట్రెస్), tension (టెన్షన్), panic(పానిక్) కి గల తేడాలు:
stress (స్ట్రెస్): భార్య కడుపుతో ఉన్నప్పుడు కలిగేది.
tension (టెన్షన్): ప్రియురాలు కడుపుతో ఉన్నప్పుడు కలిగేది.
panic(పానిక్): ఇద్దరూ కడుపుతో ఉన్నప్పుడు వచ్చేది.

57. సోదర ప్రేమ

టీచర్ : పిల్లలూ, ఒక వ్యక్తి ఒక కుక్కను చావగొడుతో ఉంటె, నేను అతనిని ఆపాను. దీనిని ఏమి అంటారు?
పిల్లలు : సోదర ప్రేమ, అంటారు టీచర్.