Sunday, April 29, 2007

38.స్కిన్‍లెస్

’వెధవా, ఇడియట్,స్టుపిడ్, రాస్కెల్..’ అంటూ కొత్తగా తిట్టడం నేర్చుకుంది
రంగారావు పెంచుకుంటున్న మాట్లాడే చిలుక.

దాన్నెలాగైనా దారిలోకి తేవాలని తిండి పెట్టడం మానేసాడు రంగారావు.
అయినా అది తిట్లు మానలేదు.

దాంతో ఒక రోజు తిక్కరేగి ఆ చిలకను తీసుకెళ్ళి ఫ్రిజ్‍లో పెట్టాడు. చలికి
తట్టుకోలేక అప్పుడైనా తన మాట వింటుందని.

కాసేపటికి చిలుక అరుపులు వినిపించి ఫ్రిజ్ తలుపులు తీశాడు.
’నీకు దణ్ణం పెడతాను. నన్ను బయటకు తియ్యి. ఇక జన్మలో నిన్ను
తిట్టను. సరేగాని... అన్ని మాటలన్నా నన్ను తిట్టకుండా కొట్టకుండా
లోపల పెట్టావు కదా! ఆ కోడి నిన్ను ఏమని తిట్టింది...ఈకలు వలిచి మరీ
లోపల పెట్టావు’ అసక్తిగా అడిగింది లోపలున్న చికెన్‍ను చూపిస్తూ.

37.మేధావి

"మీరు పెద్దయ్యాక ఏం కావాలనుకుంటున్నారో ఓ కాగితం మీద రాయండి"
అని టీచర్ చెప్పింది.

కలెక్టర్, ఇంజనీర్, డాక్టర్ ఇలా ఎవరికి తోచింది వారు రాస్తున్నారు.

"ష్, " చిన్నగా సంధ్యను పిలిచాడు కిట్టు.

"ఏంటి?" అడిగింది సంధ్య.

"మేధావిలో ’ధ’కు మధ్యలో చుక్క ఉంటుందా?"

Saturday, April 21, 2007

36. స్నేహం

ఒక వ్యక్తి రోజు బార్‌కి వచ్చి రోజు మూడు పెగ్గులు విడివిడి గ్లాసులలో పోసుకుని
తాగుతున్నాడు. ఇది చూసి అక్కడి వెయిటర్ ఒక రోజు అడిగాడు..

" సార్! మీరు రోజూ మూడు పెగ్గులు ఇలా విడివిడి గ్లాసులలో ఎందుకు
తాగుతున్నారు.ఒకే గ్లాసులో తాగొచ్చుగా?"

"తాగొచ్చు. కాని దీనికొక కథ ఉంది! నేను, రమేష్, కిరణ్ ముగ్గురం
ప్రాణస్నేహితులం. కలిసి చదువుకున్నాం.రోజు కలిసి మందు కొట్టేవాళ్ళం.
కాని రమేష్ ఇప్పుడు అమెరికాలో, కిరణ్ డిల్లీలో ఉన్నారు. ఆ అలవాటు
తప్పకుండా వాళ్ళను గుర్తుచేసుకుంటూ మూడు పెగ్గులు తాగుతున్నాను.
ఒకటి నాది మిగాతా రెండూ వాళ్ళవి అన్నమాట."

"ఓ మీరు నిజంగా గ్రేట్ సార్"

ఒక రోజు అతడు రెండు పెగ్గులు మాత్రమే తెప్పించుకున్నాడు. అలా వారం
చూసి వెయిటర్ అడిగాడు.

"సార్! ఎమైంది మీ స్నేహితులలో ఎవరైనా చనిపోయారా?"

"లేదు. డాక్టర్ నన్ను తాగొద్దన్నారు"

Tuesday, April 17, 2007

35. చెప్పలేనండి

’ఆ టీవీ’వాళ్ళు రోడ్డు మీద ఇంటర్వ్యూ చేస్తూ అటు రోడ్డు మీద చిన్న సంచీ
పట్తుకుని వెళుతున్న ఒక వ్యక్తిని ఆపి----


"మీకు’ ఆ టీ వీ’ అంటే ఇష్టమా లేక ’కీ టీ వీ’ అంటే ఇష్టమా?" అన్నారు
జవాబు చెప్పమని ఎంకరేజ్ చేస్తూ.

"చెప్పడం కష్టమండీ"

"పోనీ ఇది చెప్పండి.. మీకు హిందీ ప్రోగ్రాములు నచ్చుతాయా లేక మన
తెలుగు ప్రోగ్రాములు నచ్చుతాయా?"

"చెప్పలేనండి. చాలా కష్టం"

"ఎందువల్ల?" అడిగింది ఆ యాంకర్ బలవంతంగా నవ్వేస్తూ.

"నాకు టీ వీ లేదండి. పోనీ ఎక్కడైనా చూద్దామంటే మా ఊళ్ళో అసలు
కరెంటే లేదు".

Monday, April 16, 2007

౩౪. కావచ్చు

ఆ రోజు క్లబ్‍లో తన ఉపన్యాసం ముగిస్తూ "మీరెవరైనా ప్రశ్నలడగదలచుకుంటే
అడగండి " అన్నాడు.


ఒకడు లేచి " సార్! మీరు కష్టపడి బాగా డబ్బు సంపాదించి, ఆ డబ్బుని
పొదుపుగా ఖర్చుపెడుతూ జీవితంలో పైకొచ్చేనన్నారుకదా. మరి మీకంత
డబ్బుంది కదా! ఎప్పుడైనా విచ్చలవిడిగా ఖర్చుపెట్టి లైఫ్ ఎంజాయ్ చేద్దామని
అనిపించలేదా?" అన్నాడు


"అనిపించేది, కాని ఖర్చు పెట్టే ముందు నేను నాలుగు ప్రశ్నలు మనసులో
వేసుకునేవాడిని. మొదట ఏదైనా వస్తువుని చూసినప్పుడు ’ ఇది నిజంగా
నాకు కావాలా ’ అని అనుకునేవాడిని. ’అవసరం’ అని అనుకునేవాడిని.
రెండోది ’ ఇది నాకు నిజంగా అవసరమా ’ అని అనుకునేవాడిని.
’అవసరమే’ అనిపించేది. మూడోది ’సరే, కాని నీకు అది నీకు కొనే స్థోమత
వుందా?’ అని ప్రశ్నించుకునేవాడిని. ’ఉంది అనుకుంటా’ అనుకునేవాడిని.
ఆఖర్ని నాలుగోప్రశ్న ’ఇది లేకుండా నీకు గడుస్తుందా?’ అని ప్రశ్నించు
కునేవాడిని. దీనికి సరియైన జవాబు మనం ఇచ్చుకోగలిగితే, జీవితంలో
నా అంతవాడు కావచ్చు."

Thursday, April 12, 2007

33. నటురె - పుటురె

ఇంగ్లీషు క్లాసులో రాము లేచి " మాస్టారూ! నటురె అంటె అర్ధం
ఏంటండి?" అని అడిగాడు.

మాస్టారికి అర్ధం కాలేదు. " నటురెనా.....అదేం పదం? ’" అని
అడిగాడు. మాస్టారికి కూడా తెలియని పదాన్ని గురించి తను
అడుగుతున్నానని రాముకు గర్వంగా అనిపించింది. "అదే
మాస్టారూ...ఎన్...ఎ...టి...యు...ఆర్...ఇ " అన్నాడు.

మాస్టారికి కోపం వచ్చింది. "వెధవాయ్! ఆ పాఠం నేను నెల రోజుల
నుండి చెబుతున్నాను. అయినా దాన్ని సరిగ్గా ఎలా పలకాలో
నీకు తెలియలేదా? దాన్ని నేచర్ అని పలకాలి. ఆ మాత్రం
తెలియనివాడివి నా క్లాసులో ఉండకు. పో... ఇంకో వారం దాకా
నా క్లాసులో కనిపించకు పో..." అని అరిచాడు.

రాము ఇంటికి వెళ్ళి తండ్రి సోముకు జరిగినది చెప్పి ఏడ్చాడు.
సోము మాస్టారితో మాట్లాడతానని చెప్పి కొడుకుని ఓదార్చాడు.
మర్నాడు బడికి వెళ్ళి ఇంగ్లీషు మాస్టారిని కలిశాడు సోము
"మాస్టారూ! వారం రోజులు మావాడు ఇంగ్లీషు పాఠాలు వినకపోతే
వాడి పుటురె దెబ్బ తింటుంది కదా?" అన్నాడు.

అంతే మాస్టారి కోపం నషాలానికెక్కింది. "పుటురెనా?.. అదేంటి?.."
అన్నాడు. సోము అన్నాడు " అదే మాస్టారు!
ఎఫ్...యు...టు...యు...ఆర్...ఇ...ఇది కూడా తెలీదా మీకు?"

మాస్టారు "?????????????????"

Tuesday, March 13, 2007

32. అందమైన అబద్ధం

పార్టీ అయిపోయిన తరవాత ఓ భార్య తన భర్తతో ఎంతో సంతోషంగా "ఏవండి

ఇవాళ నేను చేసిన వంటను మీరు అందరి ఎదుట మెచ్చుకోవడం చూసిన

నాకు సంతోషం, ఆశ్చర్యం రెండూ కలిగాయి తెలుసా?" అంది.


"ఇందులో ఆశ్చర్యపడాల్సిందేముంది. రోజూ నీ ఎదుట అబద్ధం చెప్పేవాడిని

ఈ రోజు అందరి ఎదుట చెప్పానంతే." అన్నాడు నిర్లక్ష్యంగా.

31.దొంగ

ఓ ధైర్యవంతురాలైన స్త్రీ ఇంట్లోకి ఓ అర్ధరాత్రి దొంగ వచ్చాడు. ఆ చీకట్లోనే వాడిని
చావగొట్టి స్పృహ తప్పేలా చేసింది. ఉదయం విచారణకు వచ్చిన పోలీసు ఇన్‍స్పెక్టర్
ఆమె సాహసాన్ని ప్రశంసిస్తుంటే దానికి ఆమె సిగ్గుపడిపోతూ........
’అబ్బే, ఇందులో నేను చేసిందేమీ లేదండి. అర్ధరాత్రి చప్పుడవడంతో మావారే క్లబ్బు
నుంచి వచ్చారనుకుని చావగొట్టానంతే’ అని చెప్పింది తాపీగా......

Thursday, March 08, 2007

30.టాప్ సీక్రెట్

ఓ శుభకార్యానికి హాజరైన అతిథులు పిచ్చాపాటిగా మాట్లాడుకుంటున్నారు.

"ఎంతైనా ఆడవాళ్ళ నోట మాట దాగదు." అన్నాడు గోపాల్.

"ఎందుకు దాగదు?" గయ్యిన లేచింది ఒకావిడ.

"అబ్బే కష్టమండి"

"నాకు 21 ఏళ్ళు ఉన్నప్పట్నుంచి నా వయసు ఎంతో దాచి పెట్టాను తెలుసా!"
గర్వంగా చెప్పిందావిడ.

"అయినా ఎప్పుడోసారి బయటికి వచ్చి తీరుతుంది" తేలిగ్గా తీసేశాడు గోపాల్.

"17 ఏళ్ళుగా దాచిపెట్టినదాన్ని ఇక ముందు దాయలేనా?"

29.నా చేతుల్లో ఏముంది.

ఇద్దరు స్నేహితులు బాగా మందుకొట్టి కార్లో తిరిగి వెళ్తున్నారు.ఒకతనికి బాగా
ఎక్కువైంది. రెండో అతను ఓ మాదిరిగా ఉన్నాడు. కారు దూసుకుపోతోంది.
ఇంతలో శశాంక్ అరవడం మొదలు పెట్టాడు.’చూడు స్తంభం...ముందు చూసుకో
స్తంభం...జాగ్రత్త రేయ్...బండి తిప్పు... తిప్పరా! ఒకటే అరిచాడు. అయినా కారు
స్తంభానికి గుద్దుకుంది. శశాంక్ ఆసుపత్రి పాలయ్యాడు.తెల్లారి స్నేహితుడు పళ్ళు
తీసుకుని శశాంక్‍ను పలకరించడానికి వచ్చాడు.

’నేను చెబుతూనే ఉన్నానా... కారు తిప్పమని’ కోప్పడ్డాడు శశాంక్.
’నేనెలా తిప్పనురా...నువ్వు డ్రైవ్ చేస్తుంటే’ విసుగ్గా అన్నాడు మిత్రుడు.

Sunday, February 18, 2007

28.కొత్త సినిమా

సుబ్బారావు: ఓరేయ్ నిన్న నాకు మా ఆవిడకు పెద్ద గొడవ జరిగింది.

అప్పారావు: ఏ విషయం మీద?

సుబ్బారావు: కొత్తగా రిలీజ్ ఐన సినిమాల గురించి..

అప్పారావు: సరే సినిమా ఎలా ఉంది.

27.తేడా

"మానసిక వ్యాధి ఉన్నవాడికి, మనో వైకల్యముగల వాడికి ఉన్న తేడా ఏమిటి?"

"ఇద్దరూ నాడీ వ్యవస్థలో కలిగే రుగ్మతలవల్ల బాధపడుతుంటారు."

"అంత పెద్ద పెద్ద మాటలతో కాకుండా నాకర్ధమయేలా చెప్పు "

"మానసిక వ్యాధి ఉన్నవాడు పదికి పది కలిపితే ముప్పై అని అనుకుంటాడు.

మనోవైకల్యము ఉన్నవాడు పదికి పది కలిపితే ఇరవై అని తెలుసు కాని

'ఇరవై' అంది ఒప్పుకోడానికి ఇష్టపడడు. చాలా?"

Wednesday, February 14, 2007

26.తెలివైన ప్రియుడు

రంగారావు బాగా కంగారుపడిపోతున్నాడు. చాలా రోజులుగా ఒక
యువకుడు అతని సెలూన్‌కి వస్తున్నాడు. జుట్టు కత్తిరించుకోవాలని
అడిగి ఎంతసేపు పడుతుందని ఆ యువకుడు అడిగి వెళ్ళిపోతున్నాడు.
రంగారావు సెలూన్ బాగా రద్దీగా ఉండటం వల్ల ఆ యువకుడిని రెండు
మూడు గంటల తర్వాత రమ్మని చెబుతుంటాడు.

ఒకరోజు మళ్ళీ ఆ యువకుడు వచ్చాడు. కటింగ్ చేయించుకు
నేందుకు ఎంత సమయం పడుతుందని అడిగాడు. రంగారావు అతన్ని
రెండు గంటల తరువాత రమ్మన్నాడు. ప్రతిసారీ టైం అడిగి వెళ్ళి
పోవడమేకాని తిరిగి ఆ యువకుడు సెలూన్‌కి రాకపోవడంతోరంగారావు
తన పనివాడిని పిలిచి, ప్రతిసారీ టైం అడిగి వెళ్ళిపోతున్న ఆ
యువకుడు ఎక్కడికి వెళూతున్నాడు? ఏం చేస్తున్నాడో తెలుసుకు
రమ్మని పంపించాడు.

కొద్దిసేపటి తరువాత పనివాడు నవ్వుతూ తుళ్ళూతూ రావడం
చూసి అడిగాడు రంగారావు.'చెప్పు,ఇంతకీవాడు ఎక్కడికెళ్ళాడు?"
"గురూ వాడు ఇక్కడినుండి సరాసరి మీ ఇంటికే వెళ్ళాడు "
అన్నాడా పనివాడు ముసిముసిగా నవ్వుతూ.

Tuesday, February 13, 2007

25. తాగుబోతు తెలివి

సుబ్బారావు తప్పతాగి బార్‌లోంచి బయటకొచ్చి ఎలాగో ఇంటి అడ్రస్
చెప్పి అటు పోనిమ్మని టేక్సి ఎక్కాడు. ఇంటికి కొంచెం దూరంలో ఉండగా
అతనికి టాక్సీకి సరిపోయే డబ్బులు తన దగ్గర లేవని స్పృహలోకొచ్చేడు.
వెంటనే టేక్సీ డ్రైవర్‌తో "ఇక్కడోసారి కారాపు. ఆ కిళ్ళీ కొట్లో అగ్గిపెట్టి
తీసుకొస్తాను.ఇందాకా టేక్సీలో 500 రూపాయల నోటు పడిపోయింది.
అగ్గిపుల్ల వెలుగులో వెతకాలి " అంటూ ఆగిన టేక్సీలోంచి దిగి, దగ్గరలో
వున్న కిళ్ళీ కొట్టు వైపు నడిచాడు. అతను కిళ్ళీకొట్టు వైపు 10
అడుగులు వేయగానే టేక్సీ ఉన్నట్టుండి స్పీడ్‌గా దూసుకుపోయింది.

Sunday, February 04, 2007

24. స్త్రీ చెవులు

ఒక ఊర్లో ఒక గిరీశం ప్రమాదం లో తన రెండు చెవులను పోగొట్టుకున్నాడు.
మన దేశంలోని అన్ని డాక్టరులను సంప్రదించిన అతని సమస్య తీరలేదు.

జర్మనీలో ఒక వైద్యుడు చెవుల మార్పిడి చేస్తాడు అని తెలిసి పొలం అమ్మి
ఆ డబ్బుతో అక్కడికి వెళ్ళాడు.ఆ డక్టరు అతనిని పరీక్షించి "సరే నేను నీ
సమస్య తీరుస్తాను " అని మాట ఇచ్చాడు.

ఆపరేషన్ అయ్యింది. వారం తర్వాత కుట్లు విప్పారు. అతను తన హోటల్ కి
వెళ్ళాడు.మరుసటిరోజు ఉదయమే కోపం తో ఆ డాక్టరుకి ఫోన్ చేసి
" నువ్వు మోసం చేసావు.నాకు స్త్రీ చెవులను పెట్టావు " అని అరిచాడు.

అప్పుడు ఆ డాక్టరు "చెవి స్త్రీదైనా పురుషుడిదైనా తేడా ఉండదు " అని చెప్పాడు.

"కాదు నువ్వు తప్పు చెబుతున్నావు. నాకు అన్ని వినపడుతున్నాయి.కాని
ఒక్కటీ అర్ధం కావట్లేదు.ఎలా చచ్చేది "

Thursday, February 01, 2007

23. దేవుడికి ఉత్తరం

చింటూకి తన పుట్టినరోజుకి వాళ్ళ మమ్మీని ఎర్ర సైకిల్ అడిగాడు.వాడు
తెగ అల్లరి చేస్తూ చెప్పిన మాట వినక స్కూల్లోను ఇంట్లోనూ అందరినీ
సతాయిస్తూ ఉండేవాడు.అప్పుడు వల్ల మమ్మీ "ఓరేయ్ చింటూ, నీవు
అల్లరి ఎక్కువ చేస్తున్నావు సరే నీకు సైకిల్ కావాలంటే నీ గురించి
దేవుడికి ఉత్తరం రాయి నీకెందుకు సైకిల్ కావాలో " అని చెప్పింది. వాడు
గంతులేసుకుంటూ తన రూము కెళ్ళి ఉత్తరం రాయసాగాడు.


1. దేవుడా!

నేను చాలా మంచి బాలుడిని నాకు ఒక ఎర్ర సైకిల్ కావాలి-
నీ మంచి మిత్రుడు చింటూ.

మళ్ళీ వాడనుకున్నాడు ఇది తప్పు కదా నేను మంచి వాడిని కాను
అల్లరి చేస్తూ అందరిని సతాయిస్తాను అని ఆ ఉత్తరం చించేసి మళ్ళీ
రాయసాగాడు.

2. దేవుడా!

నీ మిత్రుడు చింటూ రాయునది.నేను మంచి బాలుడిలా ఉన్నాను.
నాకొక ఎర్ర సైకిల్ కావాలి.

మళ్ళీ ఇది నిజము కాదుకదా అనుకొని ఆ ఉత్తరం చించేసి మళ్ళీ
రాయసాగాడు.

3. దేవుడా!

నేను మంచివాడినే. నాకొక ఎర్ర సైకిల్ కావాలి.
చింటూ.

మళ్ళీ ఇది నిజము కాదుకదా అనుకొని ఆ ఉత్తరం చించేసి మళ్ళీ
రాయసాగాడు.

4. దేవుడా!

నేను మంచి బాలుడిని కాను.నన్ను క్షమించు.నువ్వు నాకొక ఎర్ర
సైకిల్ వచ్చేలా చేస్తే మంచివాడిలా ఉంటాను.

థాంక్యూ చింటూ


ఐనా కూడా తనకు సైకిల్ రాదనుకొని నిరాశతో అలా నడుస్తూ గుడికెల్లాడు.
దారిలో వినాయకుడి గుడి దగ్గర ఆగాడు. చుట్టూ ఎవరూ లేరని మెల్లిగా
ఆ వినాయకుడి విగ్రహాన్ని తీసుకుని తన జేబులో వేసుకుని ఇంటి
కొచ్చాడు.మళ్ళీ ఉత్తరం రాయసాగాడు.

5. దేవుడా!

నీ కొడుకు నా దగ్గరున్నాడు. నీకు క్షేమంగా కావాలనుకుంటే మర్యాదగా
నాకొక ఎర్ర సైకిల్ వచ్చేలా చేయి.

నీకు తెలుసు నేనెవరో.

హహహ

22. చింటు : ఒరేయ్ బంటు మా నాన్న వట్టి పిరికివాడు తెలుసా.
బంటు : ఎందుకురా?

చింటు : ఎప్పుడు రోడ్ క్రాస్ చేయాల్సి వచ్చినా నా చేయి పట్టుకుని వదలద్దు అంటారు.





23. నీ గమ్యం వైపు సాగిపో
నీ మనసుకు నచ్చిన దారిలోనే వెళ్ళు
నీ వెనుకనున్నవానిని నిన్ను దాటనీకు
నీ ముందున్నవానిని దాటివెళ్ళు




















అప్పుడే ఒక మంచి లారీ డ్రైవర్ కాగలవు.

ముద్దు(గుమ్మ)కారు

21. ఒకవేళ అమ్మాయిలే కార్లు డిజైన్ చేస్తే?




.

.

.
.


.

.

.

.



.

.

.







Friday, January 26, 2007

20

హే! కృష్ణా తు ఇస్ కలియుగ్ మె ఆ కర్ తొ దిఖా…

హే! కృష్ణా తు ఇస్ కలియుగ్ మె ఆ కర్ తొ దిఖా…

తూనె 18 సాల్ కి ఉమర్ మె మమ కంస్ కొ మారా,
BIN LADEN కొ హాత్ లగాకర్ తొ దిఖా…

తూనె అర్జున్ కొ తొ సారి గీతా సునయీ,
మేరె ప్రాజెక్ట్ మెనేజెర్ సె ఏక్ బార్ బాత్ కర్ కె తొ దిఖా..

తూనె తొ అర్జున్ కా సారథి బంకె పాండవొంకొ జితాయా
ఇండియన్ క్రికెట్ టీం క కోచ్ బన్ కె WorldCup జితాకె తొ దిఖా…

తూనె భరి మెహ్ఫిల్ మె ద్రౌపది కొ సారీ పెహ్నాయి,
మల్లిక షెరవత్ కొ ఎక్ జోడి కప్డె పెహ్న కె తొ దిఖా…

తూనె గోకుల్ కి 1600 గోపియో పటాయి,
మేరి కంపేనీ కి సిర్ఫ్ ఎక్ లడ్కి కొ పటాకర్ తొ దిఖా…

హే! కృష్ణా తు ఇస్ కల్యుగ్ మైన్ ఆకర్ తొ దిఖా…

Friday, December 29, 2006

19

కొన్ని సర్దార్ జోకులు.....

---000---



సర్దార్ No.1 - యార్ మైనె అప్ని గిర్ల్ ఫ్రిఎంద్ కొ gift దెన హై, క్య దూ?

సర్దార్ No.2 - గోల్డ్ రింగ్ దే దే

సర్దార్ No.1 - కోయి బడి చీజ్ బతా..

సర్దార్ No.2 - M.R.F కా టైర్ దే దే. .


---000---

ఒక సర్దార్ జీవితాంతం ఒక్కటే ఒక్క విషయాన్ని గురించి ఆలోచిస్తూ చనిపోయాడు...

"మేరె తో 2 బ్రదర్స్ హై, ఫిర్ మేరీ సీస్టర్ కె 3 బ్రదర్స్ కైసే?"

---000---

సర్దార్ తన సిస్టర్ తో కలసి బైక్ మీద వేళుతున్నాడు.

దారిలో ఒక కొంటె కుర్రాడు: ఓహ్! పాజీ, గర్ల్‌ఫ్రెండ్ తో షికార్లు కొడుతున్నావా?

సర్దార్: "ఓయే ! గర్ల్‌ఫ్రెండ్ హోగీ తేరి, మేరీ తొ సిస్టర్ హై."

---000---

సర్దార్: డార్లింగ్, కొన్ని సంవత్సరాల క్రితం నువ్వు కోకాకోలా బాటిల్ లా ఉండేదానివి...
సర్దార్ భార్య: మరి ఇప్పుడో?

సర్దార్: నిజం డార్లింగ్..ఇప్పుడుకూదా..తేడాఅల్లా ఇంతకుముందు...300ml బాటిల్ లా ఉండేదానివి, ఇప్పుడు.. 1.5lt బాటిల్లా ఉన్నావు..అంతే..