’వెధవా, ఇడియట్,స్టుపిడ్, రాస్కెల్..’ అంటూ కొత్తగా తిట్టడం నేర్చుకుంది
రంగారావు పెంచుకుంటున్న మాట్లాడే చిలుక.
దాన్నెలాగైనా దారిలోకి తేవాలని తిండి పెట్టడం మానేసాడు రంగారావు.
అయినా అది తిట్లు మానలేదు.
దాంతో ఒక రోజు తిక్కరేగి ఆ చిలకను తీసుకెళ్ళి ఫ్రిజ్‍లో పెట్టాడు. చలికి
తట్టుకోలేక అప్పుడైనా తన మాట వింటుందని.
కాసేపటికి చిలుక అరుపులు వినిపించి ఫ్రిజ్ తలుపులు తీశాడు.
’నీకు దణ్ణం పెడతాను. నన్ను బయటకు తియ్యి. ఇక జన్మలో నిన్ను
తిట్టను. సరేగాని... అన్ని మాటలన్నా నన్ను తిట్టకుండా కొట్టకుండా
లోపల పెట్టావు కదా! ఆ కోడి నిన్ను ఏమని తిట్టింది...ఈకలు వలిచి మరీ
లోపల పెట్టావు’ అసక్తిగా అడిగింది లోపలున్న చికెన్‍ను చూపిస్తూ.
Sunday, April 29, 2007
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
Good one. Keep posting.
Post a Comment