రాజు అతని ఐదుగురు స్నేహితులు బార్‌లో ఓ టేబుల్ చుట్టూ కూచున్నారు.
మందు పార్టీ జోరుగా సాగుతుంది. అందరూ తమ సెల్‌ఫోన్లన్నీ బల్ల మీదే
ఉంచారు. కాసేపయ్యాక వళ్ళలో నలుగురు బయటికి వెళ్ళారు.
ఇంతలో బల్ల మీద ఉన్న వాటిలో ఒక సెల్ మోగింది. రాజు ఆ ఫోనెత్తాడు.
"ఏవండి! మీ లాకర్లో డబ్బులు తీసుకుని నేనో నెక్లెస్ కొనుక్కుంటున్నా" అంది
" ఒక్క్టేం ఖర్మ..రెండు కొనుక్కో" అన్నాడు రాజు.
" పట్టు చీర కూడా కొనుక్కుందామనుకుటున్నా".
" అవీ రెండు తీసుకో"."
" మరి వడ్డాణమో..."
" నచ్చితే అవి కూడా రెండు తీసుకో"
పక్కనున్న మిత్రుడికి నోట మాట రావట్లేదు.
ఫోన్ పెట్టేసాక అడిగాడు. "ఒరేయ్ నీకు నీ భార్యంటే చాలా ఇష్టంలా ఉందే?"
"ఇష్టమా పాడా! ఆ ఫోన్ నాది కాదు" మెల్లిగా చెప్పాడు రాజు.
Saturday, May 12, 2007
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
అవతల ఆవిడ కూడా మందు పార్టీలోనే ఉండి ఉండాలి, లేకపోతే ఫోన్లో మాట్లాడేవాడు తన మగడోకాడో కానదా! ;)
Post a Comment