ఇది నా 51 వ టపా....ఇంతకాలము నా సుత్తిని భరించిన వారికి, అభిప్రాయములు వ్రాసిన వారికి, వ్రాయని వారికి ధన్యవాదములు...
జ్యోతిగారికి..(ఈమధ్య, ఈమె చాలా మంచి పనులు చేసి, గోప్ప పేరుతెచ్చుకొంటోంది.. అందరూ ఈమెనే పొగుడుతున్నారు...ఏం..మేమేమి చేయటం లేదా..అంతా విడ్డురం కాకపోతె...ఏమిటో..)నేను సర్వదా ఋణపడి ఉన్నాను...తన ప్రోద్బలము, సహాయములే లేకపోతె..50 జోకులు వ్రాసేవాడిని కాదేమో...
జ్యోతీ గారు...ధన్యవాదములండీ....పైన వ్రాసింది (అదే బ్రాకెట్టులో వ్రాసింది) సరదాకే...
మరొక్కసారి అందరికీ ధన్యవాదములు..కృతజ్ఞ్తలు..
*****************************************************
వెంగళప్ప ఒక రేడియో షాపు వాడితో గొడవ పడుతున్నాడు.
వెంగళప్ప: నువ్వు నన్ను మోసం చేశావు...
షాపువాడు: లేదు సార్..! మీకు మంచి రేడియోనే ఇచ్చాను..
వెంగళప్ప: దీనిమీద "Made in Japan" అని రాసుంది...కానీ ఆన్ చేస్తే "All India Radio" అని అంటుంది...నేనేమన్నా తిక్కవాడిననుకొన్నావా?
*****************************************************
Wednesday, June 20, 2007
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
హలో అనిల్,,, ఇప్పటికైనా బద్ధకం వదిలించుకున్నందుకు సంతోషం...తొందరగా రాయి మరి..నన్ను దాటిపో..ఎవరొద్దన్నారు.
కాని నువ్వు రంగు మార్చి మరీ చెప్పినందుకు కొంచం ఆలోచించాల్సిందే మరి....
"వ్రాయని వారికి"
నవ్విస్తున్నందుకు ధన్యవాదములు.
Post a Comment