దేవలోకంలో IVRS పెడితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి.
***********************************************************
మీరు ఎప్పుడైనా భగవంతుణ్ణి ప్రార్దించారనుకోండి...అప్పుడు....
నమస్కారము..దేవలోకమును తలచుకున్నందుకు..ధన్యవాదములు
మీరు
వినాయకుడు గారి తో మాట్లాడలనుకొంటే...1 నొక్కండి.
శివుడు గారిని తో మాట్లాడలనుకొంటే...2 నొక్కండి.
కృష్ణుడు గారిని తో మాట్లాడలనుకొంటే...3 నొక్కండి.
(పొరపాటున 3 నొక్కిటే...వచ్చే జవాబు - క్షమించండి...ప్రస్తుతము వారు గోపికలతో బిజీగా ఉన్నారు...తరువాత సంప్రదించండి)
మిగతా దేవుళ్ళు / దేవతల లిస్టు కొరకు - 4 డైలు చేయండి.
రంభ, ఊర్వశి, మేనకల కోసము - 5 నొక్కండి (దీనిని నొక్కితే - లైను ఎంగేజ్)
(గనేష్ గారితో మాట్లాడుదామని 1 నొక్కారో...జవాబు...)
కోరిక కోరాలనుకుంటే - 5 నొక్కండి.
సమస్యలు / సలహాల కొరకు - 6 నొక్కండి.
ధన్యవాదములు తెలుపడానికి - 7 నొక్కండి.
ఇతరత్రా కొరకు మా కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ నారదులతో మాట్లాడాలంటే - 8 నొక్కండి.
(8 నొక్కారనుకొందాము)
శ్రావ్యముగా ఒక చిన్న భజన వినిపిస్తుంది...వెంటనే...
మా రికార్డుల ప్రకారము మీరు ఇప్పటికే ఈరోజు ఒక సారి మమల్ని తలచుకొన్నారు..రేపు మరళా ప్రయతించండి..
మీ అత్యవసరమైతే దగ్గరలో ఉన్న మా బ్రాంచి దేవాలయములోని మా ఎగ్జిక్యూటివ్ అయిన పూజారి గారిని కలుసుకోండి...
దేవలోకమును సంప్రదించినందుకు...ధన్యవాదములు...
****కనెక్షన్ కట్****
Wednesday, June 13, 2007
Subscribe to:
Post Comments (Atom)
6 comments:
ధన్యవాదములు. మీరు క్యూ లో ఉన్నారు. ప్రస్తుతం దేవత(రెప్రజెంటెటివ్)లందరూ బిజీ గా ఉన్నరు. తరువాతి దేవత(రెప్రజెంటెటివ్) వచ్చు నంతవరకు దయ చేసి వెయిట్ చెయ్యగలరు. మీ కాల్ మాకెంతో ఇంపార్టెంట్. (బ్యాక్ గ్రౌండ్ లో 'నరవరా ఓ సురవరా" అనే పాట)
బాగుంది.
EVV పంధాలో...:)
హహహ... ఇవాళ్టి నా అనుభావాలతో విసుగొచ్చి ఇటు చూసేసరికి దాని మీదే చురక.
భలే, దేవుళ్ళు ఇలాగయినా తగిలితే బాగుండు, ఓ గంట వెయిటింగయినా పరవాలేదు.
అదిరింది మాస్టారు.
kevvu keka...
KEKOOOOOOOOOOOOOOO KEKAAAAAAAAAAAAAAAAA
Post a Comment