Monday, May 28, 2007

45. సర్కస్

వేసవి సెలవులు. మనవడికి ఇంట్లో బోర్ కొడుతుంది. తాతను సతాయించసాగాడు.

మనవడు : తాతా, సినిమాకెళ్దామా?
తాత : వద్దురా! అన్నీ చెత్త సినిమాలు.ఊరికే డిష్యుం డిష్యుం, అనవసరమైన పాటలు.

మనవడు: ఐతే పార్కుకెళ్దామా?
తాత : అబ్బా అక్కడంతా గోలగోలగా ఉంటుంది. నేను రాను.


మనవడు : జూ కెళ్దామా మరి?
తాత : హు. అక్కడేముంటాయి అన్ని జంతువులు. అవి టీ.వీ లోనే చూసుకోవచ్చు. ఇంత దానికి ఎండలో వెళ్ళాలా?

మనవడు: ఐతే సర్కస్ కెల్దామా?
తాత : అక్కడేముంటుంది? బోర్.నేను రాను.


మనవడు: అక్కడ చాలా మంది అందమైన అమ్మాయిలు చిన్న చిన్న బట్టలేసుకుని సర్కస్ ఫీట్లు చేస్తారు తెలుసా!
తాత : ఓహో! ఐతే వెళ్దాం పద సర్కస్ ఎలా ఉంటుందో..

Thursday, May 24, 2007

44.యాక్సిడెంట్

ఒక రోజు ప్రసాదు చేతికి కట్టుతో ఆఫీసుకొచ్చాడు. అతని స్నేహితుడు శంకరం ఆదుర్దాగా అడిగాడు.

శంకరం : ఒరేయ్ ప్రసాదు! ఏమైందిరా? ఆ కట్టేంటి?

ప్రసాదు : యాక్సిడెంట్ ఐందిరా?

శంకరం : ఎలా జరిగింది. దేనివల్ల?

ప్రసాదు : అరటిపండు తొక్కవల్ల

శంకరం : అదెలారా? ఐనా అరటిపండు తొక్కవల్ల చేయివిరిగిందా?? ఆ??

ప్రసాదు : కాదురా? అరటితొక్క మీద కాలేసి జారిపడింది మా ఆవిడ. అది చూసి నేను నవ్వాను...

43.ఆట

ఒకరోజు రాజేష్ అతని తండ్రి బోర్ కొడుతుందని టీచర్ స్టూడెంట్ ఆటాడదామని అనుకున్నారు.

తండ్రి : "రాజేష్ ముందు నువ్వు టీచర్‌వి అన్నమాట. మొదలెట్టు."

రాజేష్: "ఒరేయ్ వెధవా! హోంవర్క్ ఎందుకు చేయలేదు. చేయి చాపు" అని స్కేలుతో బాదేసాడు.

తండ్రి ఎందుకొడుతున్నాడో తెలీక ఊరుకున్నాడు బాధను పళ్ళబిగువున పట్టుకుని.తర్వాత వీడి పని చేద్దాం అని.

తండ్రి : "ఇప్పుడు నేను టీచర్ ని.."

రాజేష్ చప్పుడు చేయకుండా వెళ్ళిపోతున్నాడు.

తండ్రి : "ఏంట్రా ఆట వదిలేసి వెళ్ళిపోతున్నావ్"

రజేష్ : "అదేం కాదు. మేము అసలు క్లాసులో ఉండము కదా అందుకే వెళ్ళిపోతున్నా. బై."

తండ్రి " ??????????

Thursday, May 17, 2007

42. ప్రోగ్రెస్ కార్డ్

చేతిలో ప్రోగ్రెస్ కార్డ్ తో తండ్రి దగ్గరకు వచ్చాడు తనయుడు.

తండ్రి కార్డు చూసి "వెధవా! ఇంగ్లీషులో నూటికి పదమూడు, లెక్కల్లో
నూటికి తొమ్మిది, సైన్సులో నూటికి పదకొండు మార్కులా? ఇలాగైతే
బాగు పడ్డట్టే నువ్వు !" అని కర్ర తీసుకుని బాదడానికి సిద్ధపడ్డాడు.

"ఆగు నాన్నా!" అరిచాడు తనయుడు.

బిత్తరపోయి ఆగాడు తండి.

" ఇది నీ చిన్నప్పటి ప్రోగ్రెస్ రిపోర్ట్. పాత పుస్తకాల్లో దొరికింది. ఉండు
తాతయ్యకి చూపిస్తాను. తాతయ్యో! " అంటూ కార్డు లాక్కుని
పరిగెత్తేడు తనయుడు తాతయ్య గదిలోకి...

Wednesday, May 16, 2007

41.నాకు తెలీదు

ఒక రోజు నరకలోకంలో యమ ధర్మరాజు కొత్తగా వచ్చిన వందమందిని ఆడాళ్ళను, మగాళ్లను వేరుగా నిలబెట్టాడు. మళ్ళీ అందులో పెళ్ళాం మాటలు వినే మగాళ్ళు ఒక ద్రిక్కు, పెళ్ళాం మాటలు వినకుండా కంట్రోల్ చేసే మగాళ్ళు ఇంకో ద్రిక్కు నిలబడమన్నాడు. ఉన్న ఎనభైమంది మగాళ్ళలో ఢెబ్బైతొమ్మిదిమంది ఒక ప్రక్క, ఒక్కడు మాత్రం మరో ప్రక్కన నిలబడ్డారు. యముడికి చచ్చేంత కోపం వచ్చింది.


వాళ్ళతో ఇలా అన్నాడు. "సిగ్గులేదూ? ఇంతమంది పెళ్ళాం మాటలు వినే దద్దమ్మలు. చీ మగజాతి పరువు తీసేసారు" అన్నాడు.


మిగిలినవాడితో "శభాష్! నువ్వొక్కడివే మొత్తం మగజాతి పరువు నిలబెట్టావు" అని మెచ్చుకున్నాడు. అప్పుడతడు " అదంతా నాకు తెలీదు సామి! నా పెళ్ళాం ఇక్కడ నిలబడమంది. అందుకే నిల్చున్నా" అన్నాడు వినయంగా.


ఇంతలో " యావండి! ఓసారిలా వస్తారూ? " అని యమధర్మరాజుగారి భార్య పిలిచింది. "ఆ.ఆ.. వచ్చే..వచ్చే".. అంటూ వెళ్ళిపోయాడు.

Saturday, May 12, 2007

40. రెండు తీసుకో

రాజు అతని ఐదుగురు స్నేహితులు బార్‌లో ఓ టేబుల్ చుట్టూ కూచున్నారు.

మందు పార్టీ జోరుగా సాగుతుంది. అందరూ తమ సెల్‌ఫోన్లన్నీ బల్ల మీదే

ఉంచారు. కాసేపయ్యాక వళ్ళలో నలుగురు బయటికి వెళ్ళారు.

ఇంతలో బల్ల మీద ఉన్న వాటిలో ఒక సెల్ మోగింది. రాజు ఆ ఫోనెత్తాడు.

"ఏవండి! మీ లాకర్లో డబ్బులు తీసుకుని నేనో నెక్లెస్ కొనుక్కుంటున్నా" అంది

" ఒక్క్టేం ఖర్మ..రెండు కొనుక్కో" అన్నాడు రాజు.

" పట్టు చీర కూడా కొనుక్కుందామనుకుటున్నా".

" అవీ రెండు తీసుకో"."

" మరి వడ్డాణమో..."

" నచ్చితే అవి కూడా రెండు తీసుకో"

పక్కనున్న మిత్రుడికి నోట మాట రావట్లేదు.

ఫోన్ పెట్టేసాక అడిగాడు. "ఒరేయ్ నీకు నీ భార్యంటే చాలా ఇష్టంలా ఉందే?"

"ఇష్టమా పాడా! ఆ ఫోన్ నాది కాదు" మెల్లిగా చెప్పాడు రాజు.

39.ప్రిస్క్రిప్షన్

ఒకావిడ మందుల షాపుకొచ్చి సైనైడ్ కావాలంది.
దేనికన్నాడా దుకాణం యజమాని.

"నా భర్తను చంపడానికి.."

"అది చాలా ఘోరం. అలాంటి పనులు నువ్వు చేయకూడదు. నీకు
సైనైడ్ అమ్మితే నా లైసెన్స్ పోతుంది" ఇంకా ఎవేవో నీతి సూత్రాలు
వల్లిస్తున్నాడు మందుల షాపు ఓనరు.

పర్సులోంచి ఓ ఫోటో తీసి అతనికి చూపించిందామె.

ఆ మందుల షాపు యజమాని భార్య, ఈవిడ భర్తా సన్నిహితంగా
ఉన్నారందులో.

"మరి మీదగ్గర ప్రిస్క్రిప్షన్ ఉందని చెప్పరేం" సైనైడ్ ఇస్తూ అన్నాడు షాపు
యజమాని.