Thursday, April 12, 2007

33. నటురె - పుటురె

ఇంగ్లీషు క్లాసులో రాము లేచి " మాస్టారూ! నటురె అంటె అర్ధం
ఏంటండి?" అని అడిగాడు.

మాస్టారికి అర్ధం కాలేదు. " నటురెనా.....అదేం పదం? ’" అని
అడిగాడు. మాస్టారికి కూడా తెలియని పదాన్ని గురించి తను
అడుగుతున్నానని రాముకు గర్వంగా అనిపించింది. "అదే
మాస్టారూ...ఎన్...ఎ...టి...యు...ఆర్...ఇ " అన్నాడు.

మాస్టారికి కోపం వచ్చింది. "వెధవాయ్! ఆ పాఠం నేను నెల రోజుల
నుండి చెబుతున్నాను. అయినా దాన్ని సరిగ్గా ఎలా పలకాలో
నీకు తెలియలేదా? దాన్ని నేచర్ అని పలకాలి. ఆ మాత్రం
తెలియనివాడివి నా క్లాసులో ఉండకు. పో... ఇంకో వారం దాకా
నా క్లాసులో కనిపించకు పో..." అని అరిచాడు.

రాము ఇంటికి వెళ్ళి తండ్రి సోముకు జరిగినది చెప్పి ఏడ్చాడు.
సోము మాస్టారితో మాట్లాడతానని చెప్పి కొడుకుని ఓదార్చాడు.
మర్నాడు బడికి వెళ్ళి ఇంగ్లీషు మాస్టారిని కలిశాడు సోము
"మాస్టారూ! వారం రోజులు మావాడు ఇంగ్లీషు పాఠాలు వినకపోతే
వాడి పుటురె దెబ్బ తింటుంది కదా?" అన్నాడు.

అంతే మాస్టారి కోపం నషాలానికెక్కింది. "పుటురెనా?.. అదేంటి?.."
అన్నాడు. సోము అన్నాడు " అదే మాస్టారు!
ఎఫ్...యు...టు...యు...ఆర్...ఇ...ఇది కూడా తెలీదా మీకు?"

మాస్టారు "?????????????????"

9 comments:

త్రివిక్రమ్ Trivikram said...

అనిల్! ఈ మధ్య చాలా గ్యాప్ తీసుకున్నట్లున్నారు...ఏమైనా నటురె, ఫుటురెలతో ఆ కరువు తీరిపోయింది. చదవగానే భలే నవ్వొచ్చేసింది.

రానారె said...

హహ్హ! తనయుని మించిన తండ్రి. (చిన్న అప్పుతచ్చు:
ఎఫ్.యు.టి.యు.ఆర్."ఇ")

సత్యసాయి కొవ్వలి Satyasai said...

హ హ హ ... కడుపుబ్బ...

చదువరి said...

భలే బావుంది జోకు!

Unknown said...

హహహ... మంచి జోకు.

Anonymous said...

IDI EEMADHYA SWATHI MONTHLY LO CHADIVINA GURTU

రానారె said...

స్వాతి మంత్‌లీ!!??

బ్లాగేశ్వరుడు said...

ఇంగ్లీషు నయం కదు ఫ్రెంచ్ మరి దారుణము. చివరి ఐదు అక్షరాలొ ఉన్న మొదటి అక్షరాన్ని పలికి మిగతా అక్షరాలను నిశబ్ధంగా ఉంచుతారు. ( విష్ణు శర్మ ఇంగ్లీషు చదువు విశ్వనాథ్ సత్యనారాయణ)

రాధిక said...

ha ha ha..adurs