చింటూకి తన పుట్టినరోజుకి వాళ్ళ మమ్మీని ఎర్ర సైకిల్ అడిగాడు.వాడు
తెగ అల్లరి చేస్తూ చెప్పిన మాట వినక స్కూల్లోను ఇంట్లోనూ అందరినీ
సతాయిస్తూ ఉండేవాడు.అప్పుడు వల్ల మమ్మీ "ఓరేయ్ చింటూ, నీవు
అల్లరి ఎక్కువ చేస్తున్నావు సరే నీకు సైకిల్ కావాలంటే నీ గురించి
దేవుడికి ఉత్తరం రాయి నీకెందుకు సైకిల్ కావాలో " అని చెప్పింది. వాడు
గంతులేసుకుంటూ తన రూము కెళ్ళి ఉత్తరం రాయసాగాడు.
1. దేవుడా!
నేను చాలా మంచి బాలుడిని నాకు ఒక ఎర్ర సైకిల్ కావాలి-
నీ మంచి మిత్రుడు చింటూ.
మళ్ళీ వాడనుకున్నాడు ఇది తప్పు కదా నేను మంచి వాడిని కాను
అల్లరి చేస్తూ అందరిని సతాయిస్తాను అని ఆ ఉత్తరం చించేసి మళ్ళీ
రాయసాగాడు.
2. దేవుడా!
నీ మిత్రుడు చింటూ రాయునది.నేను మంచి బాలుడిలా ఉన్నాను.
నాకొక ఎర్ర సైకిల్ కావాలి.
మళ్ళీ ఇది నిజము కాదుకదా అనుకొని ఆ ఉత్తరం చించేసి మళ్ళీ
రాయసాగాడు.
3. దేవుడా!
నేను మంచివాడినే. నాకొక ఎర్ర సైకిల్ కావాలి.
చింటూ.
మళ్ళీ ఇది నిజము కాదుకదా అనుకొని ఆ ఉత్తరం చించేసి మళ్ళీ
రాయసాగాడు.
4. దేవుడా!
నేను మంచి బాలుడిని కాను.నన్ను క్షమించు.నువ్వు నాకొక ఎర్ర
సైకిల్ వచ్చేలా చేస్తే మంచివాడిలా ఉంటాను.
థాంక్యూ చింటూ
ఐనా కూడా తనకు సైకిల్ రాదనుకొని నిరాశతో అలా నడుస్తూ గుడికెల్లాడు.
దారిలో వినాయకుడి గుడి దగ్గర ఆగాడు. చుట్టూ ఎవరూ లేరని మెల్లిగా
ఆ వినాయకుడి విగ్రహాన్ని తీసుకుని తన జేబులో వేసుకుని ఇంటి
కొచ్చాడు.మళ్ళీ ఉత్తరం రాయసాగాడు.
5. దేవుడా!
నీ కొడుకు నా దగ్గరున్నాడు. నీకు క్షేమంగా కావాలనుకుంటే మర్యాదగా
నాకొక ఎర్ర సైకిల్ వచ్చేలా చేయి.
నీకు తెలుసు నేనెవరో.
Thursday, February 01, 2007
Subscribe to:
Post Comments (Atom)
4 comments:
బాగుంది
ha ha baagundi.
భలేగా వుంది. కిడ్నాపింగ్ అందరికీ తెలిసిపోయిందన్నమాట!
--ప్రసాద్
http;//blog.charasala.com
ఆ గడుగ్గాయి లాంటి వారే తమరన్నమాట!
-చింటు(ఇది నా ముద్దు పేరు!)
Post a Comment