ఒక ఊర్లో ఒక గిరీశం ప్రమాదం లో తన రెండు చెవులను పోగొట్టుకున్నాడు.
మన దేశంలోని అన్ని డాక్టరులను సంప్రదించిన అతని సమస్య తీరలేదు.
జర్మనీలో ఒక వైద్యుడు చెవుల మార్పిడి చేస్తాడు అని తెలిసి పొలం అమ్మి
ఆ డబ్బుతో అక్కడికి వెళ్ళాడు.ఆ డక్టరు అతనిని పరీక్షించి "సరే నేను నీ
సమస్య తీరుస్తాను " అని మాట ఇచ్చాడు.
ఆపరేషన్ అయ్యింది. వారం తర్వాత కుట్లు విప్పారు. అతను తన హోటల్ కి
వెళ్ళాడు.మరుసటిరోజు ఉదయమే కోపం తో ఆ డాక్టరుకి ఫోన్ చేసి
" నువ్వు మోసం చేసావు.నాకు స్త్రీ చెవులను పెట్టావు " అని అరిచాడు.
అప్పుడు ఆ డాక్టరు "చెవి స్త్రీదైనా పురుషుడిదైనా తేడా ఉండదు " అని చెప్పాడు.
"కాదు నువ్వు తప్పు చెబుతున్నావు. నాకు అన్ని వినపడుతున్నాయి.కాని
ఒక్కటీ అర్ధం కావట్లేదు.ఎలా చచ్చేది "
Sunday, February 04, 2007
Subscribe to:
Post Comments (Atom)
5 comments:
హ్హ..హ్హ..హ్హ!
ఇక ఎన్నో రోజులు ఇలాంటి జోకులు వెయ్యలేవు...రోజులు దగ్గరపడ్ఢాయి కదా;)
ఉన్న నాలుగు రోజులు ఎంచక్కా ఎంజాయ్!
maamiidea jokulu vestaara?inkennaallu vestaaru lemdi.kaaniiyamdi.
ఈయనకు పెళ్ళి చేయాల్సిందే. అప్పుడుగానీ ఈయన చెవులు బాగుపడవు.
--ప్రసాద్
http://blog.charasala.com
గురువు గారు,
మీరు ట్రాన్సిషన్ స్టేజ్ లో వున్నారు. మీ లో వున్న హాస్యాన్నంతా ఒక్కసారిగ కక్కేస్తున్నారు.
మీకోసం రాసిన నా బ్లాక్కెళ్ళి ఆనందించండి.
విహారి
http://vihaari.blogspot.com
ఏం బ్రదర్, పెళ్లిచేసుకోబోతున్నారని తెలియగానే జనాలంతా 'నీ పనైపోయిందిపో..' అని భయపెడుతున్నారు. మీ రియాక్షనేమిటి? రాయండి.
ఏమైనా, నా నుండి కూడా అందుకోండి శుభాకాంక్షలు.
Post a Comment