Sunday, February 18, 2007

28.కొత్త సినిమా

సుబ్బారావు: ఓరేయ్ నిన్న నాకు మా ఆవిడకు పెద్ద గొడవ జరిగింది.

అప్పారావు: ఏ విషయం మీద?

సుబ్బారావు: కొత్తగా రిలీజ్ ఐన సినిమాల గురించి..

అప్పారావు: సరే సినిమా ఎలా ఉంది.

27.తేడా

"మానసిక వ్యాధి ఉన్నవాడికి, మనో వైకల్యముగల వాడికి ఉన్న తేడా ఏమిటి?"

"ఇద్దరూ నాడీ వ్యవస్థలో కలిగే రుగ్మతలవల్ల బాధపడుతుంటారు."

"అంత పెద్ద పెద్ద మాటలతో కాకుండా నాకర్ధమయేలా చెప్పు "

"మానసిక వ్యాధి ఉన్నవాడు పదికి పది కలిపితే ముప్పై అని అనుకుంటాడు.

మనోవైకల్యము ఉన్నవాడు పదికి పది కలిపితే ఇరవై అని తెలుసు కాని

'ఇరవై' అంది ఒప్పుకోడానికి ఇష్టపడడు. చాలా?"

Wednesday, February 14, 2007

26.తెలివైన ప్రియుడు

రంగారావు బాగా కంగారుపడిపోతున్నాడు. చాలా రోజులుగా ఒక
యువకుడు అతని సెలూన్‌కి వస్తున్నాడు. జుట్టు కత్తిరించుకోవాలని
అడిగి ఎంతసేపు పడుతుందని ఆ యువకుడు అడిగి వెళ్ళిపోతున్నాడు.
రంగారావు సెలూన్ బాగా రద్దీగా ఉండటం వల్ల ఆ యువకుడిని రెండు
మూడు గంటల తర్వాత రమ్మని చెబుతుంటాడు.

ఒకరోజు మళ్ళీ ఆ యువకుడు వచ్చాడు. కటింగ్ చేయించుకు
నేందుకు ఎంత సమయం పడుతుందని అడిగాడు. రంగారావు అతన్ని
రెండు గంటల తరువాత రమ్మన్నాడు. ప్రతిసారీ టైం అడిగి వెళ్ళి
పోవడమేకాని తిరిగి ఆ యువకుడు సెలూన్‌కి రాకపోవడంతోరంగారావు
తన పనివాడిని పిలిచి, ప్రతిసారీ టైం అడిగి వెళ్ళిపోతున్న ఆ
యువకుడు ఎక్కడికి వెళూతున్నాడు? ఏం చేస్తున్నాడో తెలుసుకు
రమ్మని పంపించాడు.

కొద్దిసేపటి తరువాత పనివాడు నవ్వుతూ తుళ్ళూతూ రావడం
చూసి అడిగాడు రంగారావు.'చెప్పు,ఇంతకీవాడు ఎక్కడికెళ్ళాడు?"
"గురూ వాడు ఇక్కడినుండి సరాసరి మీ ఇంటికే వెళ్ళాడు "
అన్నాడా పనివాడు ముసిముసిగా నవ్వుతూ.

Tuesday, February 13, 2007

25. తాగుబోతు తెలివి

సుబ్బారావు తప్పతాగి బార్‌లోంచి బయటకొచ్చి ఎలాగో ఇంటి అడ్రస్
చెప్పి అటు పోనిమ్మని టేక్సి ఎక్కాడు. ఇంటికి కొంచెం దూరంలో ఉండగా
అతనికి టాక్సీకి సరిపోయే డబ్బులు తన దగ్గర లేవని స్పృహలోకొచ్చేడు.
వెంటనే టేక్సీ డ్రైవర్‌తో "ఇక్కడోసారి కారాపు. ఆ కిళ్ళీ కొట్లో అగ్గిపెట్టి
తీసుకొస్తాను.ఇందాకా టేక్సీలో 500 రూపాయల నోటు పడిపోయింది.
అగ్గిపుల్ల వెలుగులో వెతకాలి " అంటూ ఆగిన టేక్సీలోంచి దిగి, దగ్గరలో
వున్న కిళ్ళీ కొట్టు వైపు నడిచాడు. అతను కిళ్ళీకొట్టు వైపు 10
అడుగులు వేయగానే టేక్సీ ఉన్నట్టుండి స్పీడ్‌గా దూసుకుపోయింది.

Sunday, February 04, 2007

24. స్త్రీ చెవులు

ఒక ఊర్లో ఒక గిరీశం ప్రమాదం లో తన రెండు చెవులను పోగొట్టుకున్నాడు.
మన దేశంలోని అన్ని డాక్టరులను సంప్రదించిన అతని సమస్య తీరలేదు.

జర్మనీలో ఒక వైద్యుడు చెవుల మార్పిడి చేస్తాడు అని తెలిసి పొలం అమ్మి
ఆ డబ్బుతో అక్కడికి వెళ్ళాడు.ఆ డక్టరు అతనిని పరీక్షించి "సరే నేను నీ
సమస్య తీరుస్తాను " అని మాట ఇచ్చాడు.

ఆపరేషన్ అయ్యింది. వారం తర్వాత కుట్లు విప్పారు. అతను తన హోటల్ కి
వెళ్ళాడు.మరుసటిరోజు ఉదయమే కోపం తో ఆ డాక్టరుకి ఫోన్ చేసి
" నువ్వు మోసం చేసావు.నాకు స్త్రీ చెవులను పెట్టావు " అని అరిచాడు.

అప్పుడు ఆ డాక్టరు "చెవి స్త్రీదైనా పురుషుడిదైనా తేడా ఉండదు " అని చెప్పాడు.

"కాదు నువ్వు తప్పు చెబుతున్నావు. నాకు అన్ని వినపడుతున్నాయి.కాని
ఒక్కటీ అర్ధం కావట్లేదు.ఎలా చచ్చేది "

Thursday, February 01, 2007

23. దేవుడికి ఉత్తరం

చింటూకి తన పుట్టినరోజుకి వాళ్ళ మమ్మీని ఎర్ర సైకిల్ అడిగాడు.వాడు
తెగ అల్లరి చేస్తూ చెప్పిన మాట వినక స్కూల్లోను ఇంట్లోనూ అందరినీ
సతాయిస్తూ ఉండేవాడు.అప్పుడు వల్ల మమ్మీ "ఓరేయ్ చింటూ, నీవు
అల్లరి ఎక్కువ చేస్తున్నావు సరే నీకు సైకిల్ కావాలంటే నీ గురించి
దేవుడికి ఉత్తరం రాయి నీకెందుకు సైకిల్ కావాలో " అని చెప్పింది. వాడు
గంతులేసుకుంటూ తన రూము కెళ్ళి ఉత్తరం రాయసాగాడు.


1. దేవుడా!

నేను చాలా మంచి బాలుడిని నాకు ఒక ఎర్ర సైకిల్ కావాలి-
నీ మంచి మిత్రుడు చింటూ.

మళ్ళీ వాడనుకున్నాడు ఇది తప్పు కదా నేను మంచి వాడిని కాను
అల్లరి చేస్తూ అందరిని సతాయిస్తాను అని ఆ ఉత్తరం చించేసి మళ్ళీ
రాయసాగాడు.

2. దేవుడా!

నీ మిత్రుడు చింటూ రాయునది.నేను మంచి బాలుడిలా ఉన్నాను.
నాకొక ఎర్ర సైకిల్ కావాలి.

మళ్ళీ ఇది నిజము కాదుకదా అనుకొని ఆ ఉత్తరం చించేసి మళ్ళీ
రాయసాగాడు.

3. దేవుడా!

నేను మంచివాడినే. నాకొక ఎర్ర సైకిల్ కావాలి.
చింటూ.

మళ్ళీ ఇది నిజము కాదుకదా అనుకొని ఆ ఉత్తరం చించేసి మళ్ళీ
రాయసాగాడు.

4. దేవుడా!

నేను మంచి బాలుడిని కాను.నన్ను క్షమించు.నువ్వు నాకొక ఎర్ర
సైకిల్ వచ్చేలా చేస్తే మంచివాడిలా ఉంటాను.

థాంక్యూ చింటూ


ఐనా కూడా తనకు సైకిల్ రాదనుకొని నిరాశతో అలా నడుస్తూ గుడికెల్లాడు.
దారిలో వినాయకుడి గుడి దగ్గర ఆగాడు. చుట్టూ ఎవరూ లేరని మెల్లిగా
ఆ వినాయకుడి విగ్రహాన్ని తీసుకుని తన జేబులో వేసుకుని ఇంటి
కొచ్చాడు.మళ్ళీ ఉత్తరం రాయసాగాడు.

5. దేవుడా!

నీ కొడుకు నా దగ్గరున్నాడు. నీకు క్షేమంగా కావాలనుకుంటే మర్యాదగా
నాకొక ఎర్ర సైకిల్ వచ్చేలా చేయి.

నీకు తెలుసు నేనెవరో.

హహహ

22. చింటు : ఒరేయ్ బంటు మా నాన్న వట్టి పిరికివాడు తెలుసా.
బంటు : ఎందుకురా?

చింటు : ఎప్పుడు రోడ్ క్రాస్ చేయాల్సి వచ్చినా నా చేయి పట్టుకుని వదలద్దు అంటారు.





23. నీ గమ్యం వైపు సాగిపో
నీ మనసుకు నచ్చిన దారిలోనే వెళ్ళు
నీ వెనుకనున్నవానిని నిన్ను దాటనీకు
నీ ముందున్నవానిని దాటివెళ్ళు




















అప్పుడే ఒక మంచి లారీ డ్రైవర్ కాగలవు.

ముద్దు(గుమ్మ)కారు

21. ఒకవేళ అమ్మాయిలే కార్లు డిజైన్ చేస్తే?




.

.

.
.


.

.

.

.



.

.

.