Sunday, November 12, 2006

10

ఉషశ్రీగారు మహాభారత ప్రవచనము చేస్తున్నారు..ఒక పల్లెటూర్లో.

'కంసా, నీ చెల్లెలు గర్భమునందు జన్మించిన 8వ సంతానము నిన్ను, నీ అహంకారాన్ని, నీ రాజ్యమును కుప్పకూలుస్తాడు' ఆలా ఆ ఆశరీరవాణి కంసునితో పలికింది.

నాయనా, అలా ఆ ఆకాశవాణి పలికిన వెంటనే కంసుడు, భయ కంపితుడై..తన తోబుట్టువు అని చూడకుండా దేవకీని ఆమె ప్రాణనాధుడైన వసుదేవుని ఖైదు చేశాడు.

కొంతకాలానికి..ఆ దేవకీమాత కి మొదటి సంతనముగా ఒక పుత్రుడు జనించాడు...ఆసంగతి తెలిసిన మూర్ఖుడైన ఆ కంసుడు..ఆ పసి గూడ్డుని విషంతో చంపించాడు.

మరికొంత కాలానికి మరియొక పుత్రుడు జన్మించగా అతనిని కొండపైనుంచి క్రిందకు పడవేయించాడా కంసుడు...

ముచ్చట దేవకీ మూడోసారి గర్భము ధరించినది..

అంతలో ఒకడు లేచి....స్వామీ నాదో అనుమానము...అని అన్నాడు..

నాయనా, శ్రీ క్రిష్ణ జననము గురించి ప్రపంచములో ఎవరికీ ఈనాటి దాకా అనుమానము లేదు...మరి నీ కెందుకు వచ్చిందో..ఇది ఆ భగవంతుని లీల అనుకోవాలి..

నాయనా "అనుమానము పేను భూతము, ఆ అనుమానమనేది ఉంది చూశావు...వెంటనే తీర్చుకోవాలి..లేకపోతె..మనిషికి అన్నము సయించదు..నిద్ర పట్టదు...అందువల్ల నీ అనుమానాన్ని వెంటనే నివృతి చేసుకో" అని ఉషశ్రీ ప్రవచించగా...

ఆ పల్లెటురి బైతు "సామీ, కంసుడికి, దేవకి 8వ సంతానము వలన మరణము ఉన్నదని తెలిసినప్పుడు, "దేవకీ, వసుదేవులను ఒకే గదిలో ఎందుకు భందించాడు?", అని అడిగాడు.

ఉషశ్రీ ఆ ప్రశ్న విని వెంటనే మూర్చపోయారు.

(అందరికీ క్షమాపణలతో, ఇది కేవలం నవ్వుకోవడానికి ఉద్దేశించినది...ఎవ్వరినీ hurt చేయలని కాదు)

No comments: