Sunday, November 12, 2006

11

మూడు తాబేళ్ళు ఒక పిక్నిక్ వెళ్ళాలని నిర్ణయించుకున్నాయి.


అక్కడికి వెళ్ళిన తరువాత సోడా మర్చిపోయాయని గుర్తించాయి.


తను వచ్చే వరకు ఎవ్వరూ తిండిని ముట్టకూడదనే ఒప్పందం మీద అందరి కన్నా చిన్నదైన తాబేలు ఇంటికి వెళ్ళి తీసుకురావడానికి సిద్ధపడింది.



ఒక వారం గడిచింది…


తరువాత ఒక నెల…


ఆ తరువాత ఒక సంవత్సరం గడిచింది…!



ఆ రెండు తాబేళ్ళు ఇలా అనుకున్నాయి ‘ఓహ్.. ఇక చాలు.. మనం తిండి మొదలుపెడదాం’



వెంటనే ఆ బుజ్జి తాబేలు ఒక రాయి వెనుకనుండి తల బయటకు పెట్టి ఇలా అంది ‘మీరు ఇలా చేస్తే, నేను వెళ్ళను గాక వెళ్ళను’

No comments: