ఇంటర్'వ్యూ'
పేరు: లాయర్ శీను
ముద్దు పేరు: మొద్దు శీను
ఇష్టం: ఇప్పుడైతే కోర్టులో వాదించడం. ఇంతకు మునుపు సూరి బావ కళ్ళలో ఆనందాన్ని చూడడం.
కష్టం: సెల్ల్ ఫోన్ వాడవద్దని చెప్పడం( అదే చర్లపల్లి జైలు లో)(బిల్లు నెనే కడతానన్నా ... అర్ధం చేసుకోరు)
నష్టం: అబ్బో..ఎంత నష్టపోయాను...టైము...బయట వుంటే ఎంతమంది బావల కళ్ళలో ఆనందాన్ని చూసేవాడిని..
మీడియా: అబ్బబ్బో..వాళ్ళంటే నాకు చాలా ఇష్టం..ముఖ్యంగా నన్ను రైలు పట్టాల పక్కన నిలబేట్టి, వీడియో తీసి, రోజుకు 30 సార్లు టివీల్లో చూపించి నన్ను హీరోని చేసారు...
నచ్చిన రంగు: ఇంకేముంది...ఎరుపే..
సినిమాలు: ఒకప్పుడు., వాటిని చూసి నేను ఫాలో అయ్యేవాడిని, కానీ ఇప్పుడు, వాళ్ళే (సినిమ వాళ్ళు) నా కధ కావాలంటున్నారు.. అదే జీవిత కధ..ప్రస్తుతం స్క్రిప్టు తయారు చేస్తున్నా...
నచ్చిన సినిమా: చిక్కడు-దొరకడు
వేదాంతం: చంపెడువాడిని నేనా?- చంపబడినది పరిటాలా? (ఈ మధ్యనే ఒకాయన జైలులో భగవథ్గీత చెబుతున్నాడులే...నాకు ఈమాత్రమే బుర్ర లోకి ఎక్కింది).
సిద్దాంతం: ఒక్కసారి కమిట్ అయ్యానంటే ...నామాట నేనే వినను.
నచ్చిన పండగ: దీపావళి..నిత్య దీపావళి...ఎందుకంటే..బాంబులు కత్తులతో బాహాటంగా ఆడుకోవచ్చుగా...
నచ్చిన పాట: బావా, రావా..నను చూసిపోవా...
సందేశం: చంపిన తప్పులేదు, జైలుకి వచ్చిన పర్లేదు...మీడియా కవరేజ్ మాత్రం వచ్చేలా చూసుకో..